TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హీరో విజయ్ దేవరకొండకు తృటిలో తప్పిన ప్రమాదం

Published on: Mon Oct 6, 2025 8:19PM

 

 

హీరో విజయ్ దేవర కొండకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మొన్నటికి మొన్న హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కానీ ఈ ప్రమాదంలోహీరోకు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకు న్నారు. 

హీరో విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి తన కారులో పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయం లో జోగులాంబ గద్వాల జిల్లా ఎన్ హెచ్ 44 పై ఉండవెల్లి స్టేజ్ సమీపానికి రాగానే హీరో విజయ్ దేవర కొండ ప్రయాణి స్తున్న కారును వెనుక నుండి ఓ బొలేరో వాహనం స్వల్పంగా ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రమాదవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. 

ఈ ఘటన అనంత రం విజయ్ దేవర కొండ వెంటనే తన తల్లిని తీసుకొని మరో కారులో హైద రాబాద్ బయలుదేరి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకున్నారు. సమాచారం అందు కున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించడమే కాకుండా బొలేరో వాహన యజమాని పైన కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.అయితే రోడ్డు ప్రమాదంలో తమ హీరో విజయ్ దేవరకొండకు ఎటు వంటి గాయాలు కాలేదని,  తృటిలో  ప్రమాదం తప్పిందని తెలియగానే అభి మానులందరూ ఊపిరి పీల్చుకున్నారు.