జగన్ పాదయాత్రకు సూర్య మద్దతు..

 

ప్రజాసంకల్పం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే జగన్ చేస్తున్న పాదయాత్రకు అనుకోని విధంగా ఓ హీరో నుండి మద్దతు లభించింది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు... ప్రముఖ తమిళ నటుడు సూర్య. సూర్య నుంచి జగన్ కు అనూహ్య మద్దతు లభించింది. "ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన,  ఆశయాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టారు" అని ఆయన అన్నాడు. తాను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పిన ఆయన, తాననుకున్నది సాధించే క్రమంలో కష్టపడేతత్వం వైఎస్‌ జగన్‌ కు ఉందని అన్నారు. తాను, జగన్ కలుసుకొన్న వేళ, రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు రావని, అదే సమయంలో ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తుందని అన్నారు.