కొత్త గెటప్ లో రామ్
Published on: Fri Mar 15, 2013 4:39PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన ప్రతి సినిమాకి లుక్, డ్రస్సింగ్ విషయంలో ఎంతోకొంత కొత్తదనాన్ని చూపిస్తుంటాడు. తాజాగా వెంకీతో చేస్తున్న సినిమాలోనూ అదే ఫాలో అవుతున్నాడు ఈ యంగ్ తరంగ్. “బోల్ బచ్చన్” రీమేక్ అయిన ఈ సినిమాలో... ఇప్పటి వరకూ కనిపించని డిఫరెంట్ లుక్ లో రామ్ కనిపించనున్నాడట. “ఒంగోలు గిత్త’”లో మెచ్యూర్డ్ లుక్ లో కనిపించిన ఈ ఎనర్జటిక్ హీరో ఇందులో క్లీన్ షేవ్ తో కనబడనున్నాడు. ఇదే విషయం రామ్ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. మరి రామ్ ఫాన్స్ ఈ కొత్త లుక్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.


