ఇంటర్‌ కూడా పూర్తి చేయని సచిన్ కి హ్యాపీ బర్త్ డే

 

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని తెలంగాణలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థులు ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దు అంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కులు ప్రతిభకు కొలమానం కాదని, చదువు రాకపోయినా వివిధ రంగాల్లో రాణించి పేరు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారని విద్యార్థులకు దైర్యం చెప్తున్నారు. అయితే ఇదే విషయంపై సినీ హీరో రామ్ ట్విట్టర్ వేదికగా..  దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ప్రస్తావిస్తూ యువతకి బాగా ఆర్డమయ్యేలా ట్వీట్ చేశారు. "పార్క్‌ లో కూర్చొని బిస్కట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. కానీ బెడ్‌ రూమ్ లో లాక్‌ వేసుకుని జీవితం ఎలారా? అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు. ఇంటర్‌ కూడా పూర్తి చేయని భారత దేశానికి గర్వకారణమైన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. రామ్ చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.