రోడ్డు ప్రమాదం.. రాజేంద్రప్రసాద్ సోదరుడి మృతి
Published on: Thu Sep 11, 2014 5:19PM

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి (57) బుధవారం విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. విజయవాడలోని రామవరప్పాడు వద్ద ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని వెళ్తున్న ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరభద్రస్వామికి కుమారుడు, కుమార్తె వున్నారు. వారిద్దరూ కెనడాలో స్థిరపడ్డారు. వీరభద్రస్వామి ఔషధ నియంత్రణ మండలి కార్యాలయంలో ఉద్యోగి.


