TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్ళి కొడుకు కాబోతున్న హీరో ప్రభాస్ ?

Published on: Tue Jan 22, 2013 10:23AM

 

 

 

 Hero Prabhas marriage details, Prabhas Marriage, Prabhas Wedding, Hero Prabhas Wedding

 

 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో పెళ్ళి కొడుకు కాబోతున్నారు. ఫిల్మ్ నగర్ లో ప్రభాస్ వివాహానికి సంబందించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హీరో ప్రభాస్ కి మ్యారేజ్ ఫిక్సయిందని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి భీమవరం కి చెందిన చుట్టాల అమ్మాయితో సంబంధం సెటిల్ చేసినట్లు సమాచారం. పెళ్లి వారితో సంప్రదింపులు జరుపుతున్న పెదనాన్న కృష్ణం రాజు ఇప్పటికే పెళ్లి చర్చలు ఓ కొలిక్కి తెచ్చారని తెలుస్తోంది. త్వరలోనే పెళ్ళి కబురు బయటి తెలియజేస్తారని సమాచారం.


ప్రభాస్ నటిస్తున్న "మిర్చి" మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.   మాటల రచయిత కొరటాల శివ "మిర్చి" సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  



మరోవైపు ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘బహుబలి'. రాజమౌళి ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, భారీ హంగులతో, చారిత్రక నేపథ్యాన్ని తలపించేలా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ పత్యర్థిగా విలన్ పాత్రలో రాణా దగ్గుబాటి నటిస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది.