TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒమిక్రాన్ వైరస్ పై బాలకృష్ణ  సంచలనం..

Published on: Mon Dec 27, 2021 2:02PM

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య ఇప్పటికే ఐదు వందలు క్రాస్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 50కి దగ్గరలో ఉండగా.. ఏపీ ఆరు కేసులు నిర్దారణ అయ్యాయి. న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలతో ఒమిక్రాన్ కేసులు పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. జనాలను భయపెడుతున్న ఒమిక్రాన్ వైరస్ అఖండ సూపర్ హిట్ జోష్ లో ఉన్న హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అఖండ సినిమా విజయం సాధించినందుకు సినీ నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను స‌హా ఆ సినిమా బృందం సోమవారం ఉద‌యం యాదాద్రికి వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకుంది. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం మాట్లాడిన బాలయ్య...  దేవుడి అనుగ్ర‌హం లేనిదే ఏ ఫ‌లితం రాద‌ని మ‌నంద‌రి న‌మ్మ‌కమని చెప్పారు. ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి అనుగ్ర‌హం  తనపై ఉంద‌ని ప్ర‌జ‌లూ భావిస్తారన్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి విప‌త్క‌ర ప‌రిస్థితులు తెచ్చిపెట్టిందని చెప్పారు బాలకృష్ణ. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వ‌చ్చి క‌ల‌వ‌ర‌పెడుతోందన్నారు.  వీట‌న్నింటినుంచి త‌ప్పించాల‌ని, అలాగే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల‌ని భ‌గవంతుడిని కోరుతున్నానని చెప్పారు. భగవంతుడి ఆశిస్తులతో అందరికి మంచే జరుగుతుందన్నారు. 

ఆ త‌ర్వాత అఖండ సినిమా యూనిట్ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించింది. తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని ఈ సంద‌ర్భంగా బాలకృష్ణ చెప్పారు. దేశం గర్వించే స్థాయిలో యాదాద్రి పునర్నిర్మాణం జ‌రుగుతోంద‌ని ప్ర‌శంసించారు.  చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణశిలతో ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పుల ప్ర‌తిభ‌ను మెచ్చుకున్నారు. ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు.