లక్ష్మీపార్వతికి నన్నపనేని వార్నింగ్
Published on: Tue Jan 24, 2012 11:11AM
గుంటూ
రు: హీరో నందమూరి బాలకృష్ణను విమర్శిస్తే నాలుక కోస్తా అంటూ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారి ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతిపై గుంటూరులో మండిపడ్డారు. బాలయ్యను స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు కాదని పిచ్చి పిచ్చి మాట్లాడతావా అలా మాట్లాడితే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. లక్ష్మీ పార్వతి ఎలా మాట్లాడతారో, ఆమె పరిస్థితి ఏమిటో, ఆమె విలువ ఏమిటో రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసునన్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి లక్ష్మీ పార్వతి అంటూ ధ్వజమెత్తారు. ఆమె తన జీవితంలోకి రాకుండే ఎన్టీఆర్ మరికొన్నేళ్లు బతికేవాడన్నారు. ఆయన చాలా ఆరోగ్యవంతుడని చెప్పారు. నగలన్నీ మూటకట్టి బయటకు పంపిన చరిత్ర నీది అంటూ విమర్శించారు.లక్ష్మీ పార్వతి లేకుంటే ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయి ఉండేవారన్నారు. ఆయనకు భారతరత్న వచ్చేదన్నారు. ఆమె లేకుంటే పార్లమెంటులో ఇప్పటికే విగ్రహం ఉండేదన్నారు. కాగా సోమవారం లక్ష్మీ పార్వతి బాలయ్యపై కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.


