TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు

Published on: Sun May 10, 2026 12:09PM

 

హైదరాబాద్ నగరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్‌లోకి వెళ్లింది. నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో  జరిగే భారీ ప్రజాసభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేయడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సభ ప్రాంగణం చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, నగరవ్యా ప్తంగా భారీగా పోలీసు బందోబస్తు మోహరించారు.

సుమారు 2,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉండగా, వివిధ ప్రత్యేక బలగాలు, కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ టీంలు కూడా భద్రతలో భాగమయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం 550 మంది ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా నియమించబ డ్డారు. మొత్తం భద్రతా వ్యవ స్థను ముగ్గురు డీసీపీలు, అయిదుగురు అదనపు డీసీపీలు పర్యవేక్షిస్తుండగా, 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్‌స్పెక్టర్లు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటు న్నారు. సభ ప్రాంగణం చుట్టూ వందలాది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తు న్నారు.

సభకు ముందు నుంచే బాంబ్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్స్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు. OCTOPUS, SOT వంటి ప్రత్యేక బలగాలు ప్రాంగ ణాన్ని పూర్తిగా స్కాన్ చేసి అనుమానాస్పద వస్తువులు లేకుండా చర్యలు తీసుకు న్నాయి. సభకు వచ్చే ప్రతి వ్యక్తికి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద కఠినమైన సెక్యూరిటీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. సభ సమయంలో డ్రోన్లు, యూఏవీలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. 

ముఖ్యంగా బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉన్నాయి. ప్రజాసభ కార ణంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మార్పులు అమలు చేస్తు న్నట్టు పోలీసులు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలు ప్రజా రవాణాను వినియో గించి ముందుగానే బయలు దేరాలని సూచించారు. మొత్తం మీద ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం పూర్తి భద్రతా కవచంలోకి వెళ్లింది.