తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
Published on: Wed May 17, 2023 7:27AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 77436 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 38వేల980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల 77 లక్షల రూపాయలు. ఇక బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
భక్తుల క్యూలైన్ కృష్ణ తేజా గెస్ట్ హౌస్ వరకూ వచ్చింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోంది.


