TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల కొండపై భక్తుల అవస్థలు... శ్రీవారి దర్శనానికి 48 గంటలు

Published on: Mon Aug 15, 2022 10:43AM

తిరుమలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ భక్తుల రద్దీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో తిరుమల కొండపై భక్తులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని టీటీడీ చెబుతున్నప్పటికీ భక్తులు మాత్రం ఇంకా ఎక్కువ సమయమే పడుతోందని చెబుతున్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా ఆరు ఏడు గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలోని భక్తులకు టీటీడీ ఎటువంటి సౌకర్యాలూ కల్పించలేదు. అన్నేసి గంటలు తీగడానికి మంచినీరు, తినడానికి అల్పాహారం సరఫరా చేయడంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేతులెత్తేసింది. క్యూ లైన్ల పరిస్థితి చూస్తే ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లన్నీ కూడా నిండిపోయి లేపాక్షి సర్కిల్, షాపింగ్ కాంప్లెక్స్, పాత అన్నదానం మీదుగా శ్రీవారివ సేవాసదన్ వరకూ కూడా భక్తుల క్యూలైన్ పెరిగిపోయింది.

దాదాపుగా రెండు కిలోమీటర్లకు మించి భక్తులు క్యూలైన న్ లో వేచి ఉన్నారు. ఇక కాలి నడక భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లూ లేవు. వరుస సెలవులు కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉందని టీటీడీ చెబుతోంది.

రూంలు దొరకక భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. భోజన సదుపాయాలు సైతం సరిగా కల్పించలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. వరుస సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని తెలిసినా అందుకు అనుగుణంగా ఏర్పాట్ల విషయంలో టీటీడీ చేతులు ఎత్తేసింది.