TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీరం దాటిన వాయుగుండం

Published on: Sat Jul 26, 2025 10:12AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. దీని ప్రభావంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, రాయలసీమల్లో భారీ  నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లవద్దనీ సూచించింది.   తీరం వెంబడి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.    
ఇక పోతే తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.  అలాగే శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.