Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు
posted on: Jul 15, 2025 9:22AM

తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, వర్షాలు మాత్రం ఆశించిన విధంగా కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
ఇక ఈ నెల 14 నుంచి రుతుపవనాలు బలహీన పడటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. తీవ్ర ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న చల్లటి కబురు తెలిపింది. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.






