TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారీ వర్షాలకు ముంబై మునక?.. విద్యాసంస్థలకు సెలవు.!

Published on: Sun Jul 5, 2026 7:51AM

భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది.   గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని   జలమయమైంది.   ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి  జనజీవనం  స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.  వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.   మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ రెడ్ అలర్ట్  జారీ చేసింది.  దీంతో  బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్   శనివారం (జులై 4) మధ్యాహ్నం నుంచే నగరంలోని అన్ని  సెలవు ప్రకటించింది.   ముంబైతో పాటున థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల పరిధిలోని  విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. 

ఈ వారం ప్రారంభం నుంచే ముంబైని ముంచెత్తుతున్న వానలు, గత 24 గంటల్లో మరింత ఉధృత రూపం దాల్చాయి. శనివారం నాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 100 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.ఆది, సోమ(జులై 5, 6) వారాలలో కూడా ముంబై వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైతో పాటు  థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది.   అత్యవసరమైతే తప్ప   ఇళ్ల నుండి బయటకు రావద్దని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలకు సూచించింది. 

భారీ వర్షాల కారణంగా  ముంబైలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముంబై లైఫ్ లైన్ గా పిలిచే సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. అంధేరి ఈస్ట్ సబ్‌వే వంటి  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన  డీవాటరింగ్ పంపులతో ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

IMD red alert Mumbai, BMC school holiday, Thane rain alert, Teluguone