TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం.. మరో మూడు రోజులు వానలే వానలు

Published on: Sat May 17, 2025 7:56PM

 

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో తిరుపతి, తూర్పుగోదావరి, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతల్లో కరెంట్ అంతరాయం ఏర్పడింది. అటు తెలంగాణలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల కారణంగా న్యూ అశోక్ నగర్ ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్ పై కప్పు ధ్వంసమైంది. బలమైన గాలులతో టిన్ షెడ్ గాల్లోకి ఎగిరిపోయి, ఒక వాహనం పై పడింది.

 రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. గంటకు 50 కి. మీ వేగంతో ఈదురుగాలులు  భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొన్నాది. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తూ దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉంది.