వరదల్లో చావు వచ్చింది
Published on: Thu Aug 28, 2025 4:27PM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో జరిగింది.
స్థానికుడైన బండి హరి అనే అంగ వికలాంగ యువకుడు గుండె పోటుతో బుధవారం మృతి చెందగా సాయంత్రం జరగాల్సిన అంత్యక్రియలు ఇబ్బందికరంగా ముగిశాయి. దహన సంస్కారాలు జరిపేందుకు వెళుతున్న వాళ్లకు భారీ వర్షాల కారణంగా ఉధృతంగా పారుతున్న గొల్ల వాగును దాటేందుకు ట్రాక్టర్, జెసిబి సహాయంతో శవాన్ని బంధువులను వాగు దాటించాల్సి వచ్చింది. చివరి చూపుకు హాజరైన బంధువులు గ్రామస్తులు సైతం వాగును దాటేందుకు తాడును ఆధారంగా తీసుకుని నానా తంటాలు పడుతూ అంతిమయాత్రను ముగించారు.


