TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్‌ జామ్..!

Published on: Tue Jul 21, 2026 10:22AM

హైదరాబాద్ నగరంలో  పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం నుంచి మేఘావృతంగా ఉన్న వాతావరణం రాత్రి వేళ ఒక్కసారిగా మారి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, కుకట్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

అదే సమయంలో నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, బేగంబజార్, గోషామహల్ ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది. మరోవైపు మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, సికింద్రాబాద్ పరిసరాల్లో కూడా వర్షం ప్రారంభ మైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించగా, కొన్ని కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.

కార్యాలయాలు, వ్యాపార సంస్థల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని, వాహనదారులు నీరు నిలిచిన రహదారుల్లో జాగ్రత్తగా ప్రయాణించా లని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Heavy rain in many places in Hyderabad, GHMC, Hydra, Traffic Police, Miyapur,