వర్ష బీభత్సానికి హస్తిన అల్లకల్లోలం
Published on: Mon May 30, 2022 10:30PM
దేశ రాజధానిని భారీ వర్షం ముంచెత్తింది. వడగండ్లు, బలమైన గాలుతతో భారీ వర్షం కురవడంతో శనివారం సాయంత్రం హస్తినలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాకపోకలు స్తంభించిపోయాయి.
వేసవి తాపం నుంచి శనివారం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించిన వర్ష బీభత్సానికి హస్తిన వణికిపోయింది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలోని చెట్లు నేల కూలడంతో సిబ్బంది నివాసాలు దెబ్బతిన్నాయి.
వేసవి తాపంతో అల్లాడిన ప్రజలకు తాజా వర్షాలు ఒకింత ఉపశమనం కలిగించగా, గంటకు 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు.


