విశాఖలో జోరు వాన..

హుధుద్ తుఫాను నుంచి కోలుకోని సుమారు మూడు సంవత్సరాల తర్వాత దీపావళికి సిద్ధమవుతున్న విశాఖ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖలో ఉదయం నుంచి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం అంతకంతకూ పెరుగుతూ భారీ వర్షంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జన జీవనం స్తంభించిపోయింది. టపాసుల దుకాణాలు, నగల షాపులు ఖాళీగా దర్శనమిస్తుండటంతో పండుగ కళ తప్పింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పూరీకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. దీని కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వారు చెప్పారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.