TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్లు

Published on: Wed Aug 20, 2025 1:47PM

శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతున్నది. దీంతో  ప్రాజెక్టు శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతుంది. దీంతో  ప్రాజెక్టు  గేట్లును ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3లక్సల 45 వేల 730 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ కు ఉరకలెత్తుతోంది.  అధికారులు. శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3లక్సల 45 వేల 730 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ కు ఉరకలెత్తుతోంది. అయితే ఎగువన జూరాల నుంచి 2 లక్షల 65 వేల 957 క్యూసెక్కుల వరదనీరు, సుంకేసుల నుంచి 1 లక్ష 42 వేల 294 క్యూసెక్కుల  వరదనీరు  శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది. 

దీంతో  శ్రీశైలం జలాశయానికి మొత్తంగా   4 లక్షల 09 వేల 376 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 4 లక్షల 11 వేల 237 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.7354 టీఎంసీలుగా నమోదైంది.  శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.