భూకంపం... తీవ్రత 6.8... సునామీ రాదట...

 

ఈమధ్య కాలంలో ఇండోనేసియా దేశంలో తరచుగా భూకంపాలు వస్తున్నాయి. ఒక వారం రోజుల క్రితమే అక్కడ భారీ భూకంపం వచ్చింది. మరోసారి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. ఇండోనేసియా పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.8గా నమోదు అయింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. రాజధాని జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని తూర్పు మలుకు ప్రావెన్స్లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం వున్నట్టు తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవని తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం గానీ ప్రాణనష్టం గానీ సంభవించినట్టు వార్తలు రాలేదు.