TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

26 వరకూ ఏపీ నిప్పుల గుండమే!

Published on: Tue May 19, 2026 9:30AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.  మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కాగా ఈ హీట్ వేవ్ మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నెల 26 వరకూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.  భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు బుధవారం ( మే 20) నుంచి   26వ తేదీ వరకు మధ్య కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.  గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి అనిపిస్తుంది.