‘గీతాంజలి’ చిత్ర దర్శకుడికి గుండెపోటు

Publish Date:Aug 5, 2014

 

అంజలి హీరోయిన్‌గా నటించిన ‘గీతాంజలి’ సినిమా ఈనెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడు రాజ్‌కిరణ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈనెల 8న విడుదల కానున్న ఈ సినిమా విడుదలలో జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తూ వుండటడంతో దర్శకుడు రాజ్‌కిరణ్ మానసిక ఒత్తిడికి గురయ్యారని, అందువల్లే ఆయనకి గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్‌కిరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్టు సమాచారం.

By
en-us Political News