TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హార్ట్ ఎటాక్ అప్పుడే ప్లాన్ చేసాడు

Published on: Mon Dec 16, 2013 9:38AM

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నతాజా చిత్రం "హార్ట్ ఎటాక్". నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కాని సంక్రాంతి బరిలో మహేష్ "1", చరణ్ "ఎవడు" వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాల తాకిడి "హార్ట్ ఎటాక్"కు ఉండకూడదని, దర్శకుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తీసేసారు. ఈ చిత్రం ప్రేమకు సంబంధించిన కథ కాబట్టి... ఫిబ్రవరి 14 ప్రేమికులరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తుంది. అనూప్ అందించిన ఆడియో త్వరలోనే విడుదల కానుంది. అసలే రెండు హిట్ చిత్రాలతో సంతోషంగా ఉన్న నితిన్ కు ఈ సినిమా ఎలాంటి విజయం అందజేస్తుందో త్వరలోనే తెలియనున్నది.