TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశ్రాంతి తరువాత తిరిగి ఉద్యమం:అన్నా

Published on: Mon Jan 9, 2012 10:46AM

న్యూ ఢిల్లీ: ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే, వైద్యుల సలహా మేరకు నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత తమ ఉద్యమం గురించి ఆలోచన చేస్తామని ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే స్పష్టం చేశారు. పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన  డిశ్చార్జ్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనిప్పుడు బాగానే ఉన్నా. కానీ కొంచెం నీరసంగా ఉంది.  నేను పూర్తిగా కోలుకున్నాక భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచన చేస్తాను అని వ్యాఖ్యానించారు.త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపాదిత పర్యటన గురించి ప్రశ్నించగా వైద్యుల సూచన మేరకు ప్రస్తుతానికి పర్యటనలు చేయలేను. అయినా అవినీతిపై పోరాటం అనేది సుదీర్ఘమైంది. దీనిపై నేను గత 25 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా. పూర్తిగా కోలుకున్నాక తిరిగి ఉద్యమిస్తా అని చెప్పుకొచ్చారు.