TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైనర్ బాలికపై హెడ్ కానిస్టేబుల్ లై*గిక దాడి! నెల్లూరు జిల్లాలో అమానుషం..

Published on: Tue Dec 28, 2021 11:43AM

కంచే చేను మేస్తే.. రక్షించాల్సిన వాడే భక్షిస్తే.. నెల్లూరు జిల్లా చిట్టమూరులో దారుణం జరిగింది. మైనర్ బాలికపై హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ అత్యాచారయత్నం చేశాడు. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంటికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాలిక తండ్రిని సమీపంలోని ఓ షాపుకి పంపించి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు హెడ్ కాని‌స్టేబుల్ సుధాకర్. బాలిక ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో బిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సుధాకర్‌ను అదుపులోకి తీసుకోని విచారించారు. విచారణలో బాలికపై అత్యాచారయత్నం చేసినట్లు తేలడంతో ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.