TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎవడి పిచ్చి వాడికానందం..! 12లక్షలు ఖర్చు పెట్టి మరీ కుక్క అవతారం ఎత్తాడు!

Published on: Thu May 26, 2022 8:03AM

జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు.. అంతేనా ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటూరు. అలాగే కుక్కరూపు దాల్చాలనుకుని అందుకోసం 12 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి గురించి అంత కంటే ఏమనగలం. అతడి రూపం, అతడి డబ్బు ఎలా ఏడిస్తే మనకేం అని ఊరుకోవడం తప్ప. జపాన్ కు చెందిన టోకోకు కుక్కలంటే అమిత ఇష్టం. తానూ కుక్కలా మారితే ఎలా ఉంటుందన్న భావన కలిగింది. అంతే ఇంకేం ఆలోచించలేదు.

సినిమాలకు మస్కట్ దుస్తులను తయారు చేసే ఓ సంస్థను సంప్రదించాడు. తన మనసులో కోరిక చెప్పాడు. వాళ్లు సరే అన్నారు. అందుకోసం 12లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. ఇతను ఓకే అన్నాడు. అంతే వారు నెలా పది రోజుల్లో ఒళ్లంతా బొచ్చుతో ఉండే ఒక పెద్ద కుక్క కాస్ట్యూమ్ ను తయారు చేసి అంద జేసింది.

అంతే మురిసిపోయిన టోకో ఆ కుక్క కాస్ట్యూమ్ లు ధరించి ఫొటోలు దిగి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. ఇదేం మాయరోగం అని నెటిజన్లు అనుకున్నా..ఆ ఫొటోలు మాత్రం తెగ వైరల్ అయిపోయాయి. కుక్క కాస్ట్యూమ్ ధరించి అతడు ప్రదర్శించిన హావభావాలు, నడవడానికి పడిన తాపత్రయం అన్నీ నెటిజన్లను నవ్వించాయి.

ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా చేశాయి. అయితేనేం తెగ నచ్చేశాయి. దీంతో అతడి యూట్యూబ్ చానల్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఇత గాడిని చూసి ఇంకెంత మంది తన వింత కోరికలు, పిచ్చి చేష్టలను ప్రదర్శిస్తారో అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.