TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింపుల్ గా దత్తాత్రేయ ఇంటిని ముట్టడి..

Published on: Wed Jan 20, 2016 12:07PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో దళిత విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి దత్తాత్రేయపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణం దత్తాత్రేయ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు విద్యార్ధి సంఘాలు ఆయన ఇంటిని ముట్టడిస్తున్నాయి. నిన్న కొన్ని విద్యార్ది సంఘాలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించాయి.. ఈరోజు మరికొన్ని సంఘాలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించాయి. ఏఐఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించి.. దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరికట్టే ప్రయత్నం చేసినా అది కాస్త విఫలమైంది.

ఇదిలా ఉండగా మరోవైపు ఇంతమంది విద్యార్ధి సంఘాలు ఒక కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడిస్తుంటే ముందుగా పోలీసులు ఏం చేస్తున్నారు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అంత సింపుల్ గా కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడి చేస్తుంటే పోలీసుల నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అని అనుకుంటున్నారు.