TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోహిత్ మరణం.. ఇవి సామాన్యుల ప్రశ్నలు..!

Published on: Fri Jan 22, 2016 4:22PM

ఇప్పుడు విశ్వం చూపంతా భాగ్యనగర విశ్వవిద్యాలయంపైనే -  పోయిన పసిప్రాణం మీదే...వచ్చిన ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అగ్నికి ఆజ్యం పోసి వెళిపోతున్నవారే...ఆర్పే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయటం లేదు...దీని మూలంగా ఎన్ని జీవితాలు రగులుతాయో ఆలోచించేవారేరి...?? కాని కొన్ని సందేహాలు ..ప్రశ్నలు గా మారి ..సామాన్యులని ఇబ్బంది పెడుతున్నాయి...

అందులో మొదటిది

1. జరిగిన ఓ విషాధ ఘటనకి దళిత వర్ణం అద్ది... మంత్రి ఇంటిపైకి జనాలని ఉసిగొల్పిన జాగృతి దళ నేతలంతా ఇప్పుడు మూగ వారైపోయారేం...??

2. కూతురు రగిల్చిన మంటలు ఆర్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి , అతని అనుచరులు వర్గం చోద్యం చూస్తున్నారేం ...??

౩. అసలింత జరుగుతున్నా ... ఆ రాష్ట్ర హోం మినిష్టర్ ఏ ప్రకటనా చేయకపోవటంలో ఆంతర్యం ఏమిటి...??

4. ఎక్కడో ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చి మూలాలు తెలుసుకోకుండా మాట్లాడి వెళ్ళిపోయారు గానీ - ఇక్కడ ఆ పార్టీ పెద్దలు ఉత్తమ్ కుమార్ , దానం , మధుయాష్కీ , వీహెచ్ ల నాలుకలు కదలటం లేదేం...??

5. పఠాన్ కోట్ , మాల్దా ల గురించి అడిగినప్పుడు నేను ఆ రాష్ట్రం వాడిని కాదు నాకేంటి సంబంధం అన్న కేజ్రీవాల్ ... ఇంత ఇదిగా లగెత్తుకుని ఎందుకొచ్చాడు...??

6. ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు తూతూమంత్రంగా వచ్చి హడావిడి చేసి పోయాడే గానీ - ఈ రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ ప్రతినిధులెవరూ నోరెత్తి మాట్లాడరేం...??

7. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో లేకపోతే - ఆయన తరువాతే అన్నీ తానే ... అనే ఆయన కుమారుడైనా మాట్లాడిలిగా ... ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ??

8. యూపీలో ఎందరో మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయని నిత్యం వార్తలొస్తున్నా పట్టించుకోని మాయావతి ఇక్కడ విషయంపై ఎందుకు మాట్లాడుతుందో...??

9. కమ్యూనిస్టుల పిల్లలెవరూ ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనరో  - ఎరక్కపోయి ఇరుక్కుపోయి ఊపిరిపోగొట్టుకుంటున్న అమాయక పేద పిల్లలకి తెలుసా...??

సామాన్య ప్రజలే కాదు - కనీసం .... వీళ్ళంతా తమని ఉద్ధరించడానికే ఆగమేఘాలపై వచ్చారని భ్రమ పడుతున్న  దళిత విద్యార్ధులు కూడా ఆలోచించలేకపోతున్నారేం...??

ఎందుకంటే - ఇక్కడ ఎవడిగోల వాడిది...గ్రేటర్ ఎలక్షన్లు అనేవే లేకపోయుంటే... ఒక్కడు కాదు మరో వంద మంది చనిపోయినా ఏ ఒక్కడూ గుమ్మం కూడా కదిలేవాడు కాదు.

ప్రపంచం చూపంతా ఓ ఘటనపై నిలిచేలా చేసి ...పెద్దలంతా ప్రపంచానికి కనపడనీయకుండా చాప క్రింద నీరులా చక్కబెడుతున్న ఘనకార్యాలేమిటో ??