రోహిత్ ఆత్మహత్య.. మోడీ క్షమాపణ చెప్పాలి.. కేజ్రీవాల్
Published on: Tue Jan 19, 2016 10:30AM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్యపై స్పందించారు. విద్యార్ధి ఆత్మహత్య ఘటనపై మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులను వెంటనే బర్త్ రఫ్ చేయాలని అన్నారు. మోదీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి సహకరించడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు.
మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై తీవ్రంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద తెలంగాణ జాగృతికార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ రాంనగర్‌లోని బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద ఆందోళనకారులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకి చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.


