TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెచ్ సీఏ వ్యవహారాల పర్యవేక్షకుడిగా జస్టిస్ నవీన్ రావు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Published on: Sat Jul 26, 2025 9:52AM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) వ్యవహారాల పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును తెలంగాణ హైకోర్టు నియమించింది. ఆయన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ సీఏలో 2007 నుంచి జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని సఫిల్ గూడా క్రికెట్ క్లబ్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం (జులై 25) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం పూర్తి స్థాయి విచారణ జరపనుంది.  

అలాగే అప్పటి వరకూ అంటే జులై 28 వరకూ  సెలక్షన్‌ కమిటీని ఎంపిక చేయవద్దని ఆ మధ్యంతర ఉత్తర్యులలో పేర్కొంది.  2024-26 సంవ త్సరాలకు లీగ్‌ మ్యాచ్‌ల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను చూసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావుకు అప్పగిస్తూ, గతంలో జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పర్యవేక్షణలో జరిగినట్లుగానే ఈసారి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.