పార్టీలకు భూమి ఏ లెక్కన ఇచ్చారు? హైకోర్టు
Published on: Tue Dec 24, 2013 2:10PM

రాజకీయపార్టీల కార్యాలయాలకు భూములను అప్పనంగా అందించడంపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. అసలు ఆయా పార్టీలకు ఏ ప్రాతిపదికన భూపందారం జరిపరంటూ ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా రాజకీయపార్టీలకు కూడా నోటీసులు జారీ చేసిది. ఎన్.ఎస్. మూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజనవాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రెవెన్యూ అధికారి ఒకరు హాజరై తమ నివేదికను అందించారు.


