సచివాలయం కూల్చివేత పై హైకోర్టు స్టే మరోసారి పొడిగింపు

కేంద్రం పరిధిలో కూల్చివేత అనుమతులు

సచివాలయం కూల్చివేత అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సచివాలయ భవనాల కూల్చివేతలో పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, కూల్చివేతలను అపాలంటూ దాఖలైన పిటిషన్ పై మరోసారి విచారణ కొనసాగింది. భవనాల కూల్చివేత కోసం కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరం ఉంటాయో లేదో చెప్పాలని కోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018 విరుద్ధంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. 

సచివాలయ భవనం కూల్చివేత సమస్య కేంద్రం చేతిలో ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం భవనాలు కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కోర్టు సూచించింది. ఎన్విరాన్మెంట్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అనుమతులపై తుది నిర్ణయం వచ్చిన తర్వాతనే సచివాలయం కూల్చివేత పై ప్రకటన ఇస్తామని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత కు కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్నది స్పష్టం చేయాలని ఆదేశించింది కోర్టు. పర్యావరణ పరిరక్షణ చట్టం క్లియరెన్స్ కు సంబంధించి గతంలో వెలువడిన అనేక జడ్జిమెంట్ కోర్టు ముందుంచారు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్.‌ జిహెచ్ఎంసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు తీసుకున్నామని సచివాలయం కూల్చివేయడానికి ఈ అనుమతులు సరిపోతాయని  కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత  విచారణ రేపటికి వాయిదా వేసింది.