బెయిల్ పై వచ్చాడు.. ఆమె తండ్రిని చంపేశాడు..

2018లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని హత్రాస్ లో చెవుటుచేసుకున్న అత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో పొలం ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న బాలిక‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌లో కోర్టు ఇద్ద‌రు నిందితుల‌ను దోషిగా తేల్చింది. అయితే అందులో ఒకడైన గౌర‌వ్ శ‌ర్మ ఇటీవ‌లే బెయిల్ పై విడుద‌ల‌య్యాడు. అతడు సోమవారం  గ్రామంలోని ఆలయానికి వెళ్లాడు. అదేసమయంలో బాధితురాలి కుటుంబం మొత్తం అక్కడే ఉంది. దీంతో గౌరవ్ ఆ కుటుంబంతో వాగ్వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో గౌరవ్ శర్మ తన దగ్గరున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాల పాలై బాధితురాలి తండ్రి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు.


దీంతో బాధితురాలు త‌మ కుటుంబానికి న్యాయం చేయండి.. గౌర‌వ్ శ‌ర్మ అనే కుక్క‌ను శిక్షించండి అంటూ క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది. ఈలోగా హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆ ఘటనలో గౌరవ్ శర్మతో పాటు నలుగురు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం గాలించి.. . వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈకేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు