రాజధానిలో మరో రైతు ఆత్మహత్య 

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యతోనైనా కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయాలని అతడు రాసిన లేఖలో రాసి పెట్టి చెట్టుకు ఊరి వేసుకుని రైతుల ఉద్యమానికి తన ప్రాణాలు త్యాగం చేశాడు. 

ఒకటి కాదు రెండు రోజులు వంద రోజులు దాటింది. అయినా మొక్కక్కవోని దిశక్షతో  దేశ రాజధాని వడిలో ఆందోళనలు చేస్తున్న రైతులు. రైతుల చట్టాలకు ప్రభుత్వాలు తూట్లుపెడుతుందని వారి హక్కుల కోసం దేశ రైతులు ఒక్కటై ఆందోళనలు చేస్తుంటే.. ఆ ఆందోళన దేశ రైతుల కాదు అన్నట్లు క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వం సంబరాల్లో మునిగింది. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటికే పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది డిసెంబరులో పంజాబ్‌కు చెందిన న్యాయవాది , సిక్కు మత గురువు సంత్ రామ్‌సింగ్ ఉద్యమం కోసం ఊపిరి తీసుకున్నారు.  

హర్యానాలోని హిసార్‌కు చెందిన రజ్బీర్ (49) రైతు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన రజ్బీర్ ఓ లేఖ రాసి టిక్రీ సరిహద్దులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు చట్టాలను రద్దు చేసి తన చివరి కోరిక తీర్చాలని అందులో ఆయన వేడుకున్నాడు. అతను రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.