TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నన్ను ఉరి తీయండి.. రాధిక తండ్రి పశ్చాత్తాపం

Published on: Sat Jul 12, 2025 8:19PM

 

హర్యానా టెన్నిస్ క్రీడాకారిణి రాధికను చంపిన కేసులో అరెస్ట్‌యిన ఆమె తండ్రి  దీపక్ యాదవ్ పశ్చాత్తాపానికి గురయ్యారు. ఆవేశంతో కుతురిపై కాల్పులు జరిపానని తనను ఉరితీయాలని పోలీసులను దీపక్ వేడుకున్నాట్లు ఆయన సోదరుడు విజయ్ తెలిపారు. రాధిక కోసం తండ్రి అన్నీ సమకూర్చాడని ఎందుకు ఇలా చేశాడో అర్ధం కావట్లేదన్నారు. నన్ను ఉరితీసే విధంగా ఎఫ్ఐఆర్ రాయండని కూడా పోలీసులకు చెప్పాడు. ఆడపిల్లను చంపేశానని రోదించాడు" అని వెల్లడించాడు. ప్రస్తుతం దీపక్ రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. రాధికను తండ్రి దీపక్ హత్య చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. 

తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతో తండ్రి హత్య చేసినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వారు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. రాధిక గత ఏడాది ఒక కళాకారుడితో కలిసి రీల్స్ చేసింది. ఇది వారి కుటుంబంలో చిచ్చు పెట్టినట్లుగా మరో వాదన. తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తమ వర్గానికి చెందని వ్యక్తిని రాధిక ప్రేమిస్తోందని.. అది తన తండ్రికి ఇష్టం లేకపోవడంతోనే హత్య చేసినట్టు దీపక్‌ యాదవ్‌ సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పుకొచ్చారు. ఇక, ఆమె ప్రియుడు.. రాధిక క్లాస్‌మేట్‌ అని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి.