TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కుమారుడి పెళ్లి పత్రికలో రైతు నినాదం

Published on: Sat Feb 6, 2021 1:36PM

రైతుల ఉద్యమానికి మద్దతుగా హర్యానాలో ఓ  రైతు తన  కుమారుడి పెళ్లి  శుభ‌లేఖ‌పై రైతుల ఉద్య‌మ నినాదాలు రాసుకొచ్చాడు. నినాలతో  పాటు చోటురాం, భగత్‌సింగ్ ఫొటోల ముద్రించాడు. రైతులు లేకపోతే ఆహారం లేదని తన కుమారుడి పెళ్లికి అందరు వచ్చి రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలని 
ఆ శుభలేఖ లో కోరాడు.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి వారి ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇదే స‌మ‌యంలో హర్యానాలో ఓ వ్యక్తి తన వంతు బాధ్యతగా రైతులు  చేస్తున్న ఉద్యమానికి వినూత్న ప‌ద్ధ‌తిలో ఇలా ఖైతల్‌- దుంద్రేహీ  గ్రామానికి చెందిన ప్రేమ్‌సింగ్‌ గోయత్ అనే రైతు తన కుమారుడి వివాహ వేడుక‌కు అంద‌రూ రావాల‌ని, రైతుల ఉద్య‌మానికి కూడా మ‌ద్ద‌తు తెలపాల‌ని చెప్పాడు. శుభ‌లేఖ‌పై రైతులు లేకపోతే ఆహారం లేదనే నినాదాన్ని ముద్రించాడు. అలాగే, ట్రాక్టర్‌పై రైతు ఉన్న చిత్రాలతో పాటు స్వాతంత్య్రం రాక‌ముందు రైతుల హక్కుల కోసం పోరాడిన నేత చోటురాం, బ్రిటిష‌ర్ల‌కు చుక్క‌లు చూపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన భగత్ ‌సింగ్‌ చిత్రాలను త‌న కుమారుడి పెళ్లి ప‌త్రిక‌లపై వేయించాడు.‌

ఇది ఇలా ఉండగా రైతుల చక్కా జామ్ (రాస్తారోకో) నేపథ్యంలో బలగాలు, శనివారం పోలీసులు అప్రమత్తమయ్యారు. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులకు తోడుగా 50 వేల మందికిపైగా పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఎక్కడికక్కడ పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.మరోవైపు 10 మెట్రో స్టేషన్లను మూసేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. మండీ హౌస్, ఐటీవో, ఢిల్లీ గేట్, విశ్వవిద్యాలయ స్టేషన్, లాల్ ఖిల్లా, జామా మసీదు, జన్ పథ్, సెంట్రల్ సెక్రటేరియట్, ఖాన్ మార్కెట్, నెహ్రూ ప్లేస్ స్టేషన్లను మూసేస్తున్నట్టు తెలిపింది