TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆమె విజ్ణతకే వదిలేస్తున్నా.. కవిత విమర్శలపై హరీష్ స్పందన

Published on: Sat Sep 6, 2025 10:48AM

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అంతా హరీష్ రావుదేనంటూ కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలపై ఇంత కాలం మౌనం వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు స్పందించారు.

తన విదేశీ పర్యటన ముగించుకుని శనివారం (సెప్టెంబర్ 6) హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తన పాతికేళ్ల రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం అన్నారు. గత కొంత కాలంలో బీఆర్ఎస్ పైనా, తనపైనా కొన్ని రాజకీయ పార్టీలూ, కొందరు నేతలూ చేస్తున్న విమర్శలనే కవిత మళ్లీ చేశారని హరీష్ రావు అన్నారు.  

 బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావు లే తెర వెనక ఉండి  కథ నడిపించారు. అంతేకాదు కాంట్రాక్ర్స్ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారంటూ తనపై తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలపై అంతా ఆమె విజ్ణతకే వదిలేస్తున్నానంటూ హరీష్ ముక్తాయించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల కష్టాలు తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని హరీష్ అన్నారు.