TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరీశ్ టార్గెట్ మిస్సయిందే..!

Published on: Fri Dec 18, 2015 9:19AM


 

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాటలకు ఎవరైనా ఫిదా అయిపోతారు. హరీశ్ రావు స్పెషల్ గా ఫోకస్ చేసి ఇతర పార్టీ  నేతలను తమ పార్టీలోకి తీసుకురావాలని ఫిక్స్ అయితే అది అయ్యేంతవరకూ వదిలిపెట్టరు. ఆయన మాటలకు ఎంత పెద్ద నేత అయినా కన్విన్స్ అవ్వాల్సిందే. మరి అలాంటి హరీశ్ రావుకు ఒక నేత ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే ఎంతో మందిని కారెక్కించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హరీశ్ రావు కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన వివేక్ పైనా ఫోకస్ చేశారు. ఆయన్ను కారెక్కించడానికి చాలా కన్విన్స్ చేశారంట హరీశ్ రావు. కానీ వివేక్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతూ తాను కారు ఎక్కలేనని చెప్పారంట. దీంతో హరీశ్ రావుకు మొదటిసారి భిన్నమైన అనుభవం ఎదురైంది. అయితే హరీశ్ రావు మాత్రం తాను సిట్టింగ్ వేసిన తర్వాత టార్గెట్ పూర్తి కాకపోవటం అన్నది ఉండదని వివేక్ ను ఉద్దేశించి హరీశ్ వ్యాఖ్యానిస్తే.. దానికి బదులుగా వివేక్ తనకు వ్యక్తిగతంగా హరీశ్ అంటే ఎంతో అభిమానమని.. కాకుంటే పార్టీ మారే విషయంలో తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని తేల్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి హరీశ్ రావు ఆకర్ష్ మంత్రం వికర్ష్ అయింది. మరి వివేక్ ను కారు ఎక్కిండానికి ఇంకా ట్రై చేస్తారో లేక.. టార్గెట్ వదిలిపెడతారో చూడాలి.