TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవితకు హరీష్ కౌంటర్.. పార్టీ పగ్గాలు కేటీఆర్ కు ఇప్పడప్పుడే కాదని క్లారిటీ

Published on: Mon Jun 2, 2025 3:46PM

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఇప్పట్లో పార్టీ పగ్గాలు అప్పగించే యోచన కేసీఆర్ కు లేదని పరోక్షంగా చెప్పారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోనే బరిలోకి దిగుతుందన్న క్లారిటీ ఇచ్చేశారు. పనిలో పనిగా కవిత ఆరోపణలనూ నిర్ద్వంద్వంగా కొట్టి పారేశారు. సోమవారం (జూన్ 2) మీడియాతో మాట్లాడిన ఆయన బీజీపీలో బీఆర్ఎస్ విలీనం ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పేరు ఎత్తకుండానే.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతోందన్న ఆమె వ్యాఖ్యలను కొట్టి పారేశారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటిని తరలించు కుపోతుంటే బీజేపీ చోద్యం చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనీ, కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికల సమరాన్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. హరీష్ రావు తన వ్యాఖ్యల ద్వారా  ఇచ్చేశారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒకటి కవిత ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చేయడంతో పాటు,  కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అంటూ వస్తున్న వార్తలు కూడా అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చేశారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.