TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరీష్ రావు నోట.. ఏపీ ప్రత్యేకహోదా మాట.!!

Published on: Tue Jul 24, 2018 12:45PM

విభజన హామీల ప్రకారం ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా అన్నారు.. ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తదో రాదో తెలీదు గాని, ఏపీకి ప్రత్యేకహోదా అనే మాట మాత్రం పదేళ్లు కాదు పాతికేళ్ళు ప్రజల నోటిలో నానేలా ఉంది.. ప్రత్యేకహోదా అంశం ఏపీలోనే కాదు తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ చర్చనీయాంశమైంది.. తెలంగాణలో అధికార పక్షం తెరాస, ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది.

 

 

ఇప్పుడు తెరాస ఏపీ ప్రత్యేకహోదా అంశంపై కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తోంది.. ఇప్పటికే కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఏపీకి ప్రత్యేకహోదా హామీ నెరవేరుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు దీనినే తెరాస అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోంది.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణ పరిశ్రమలన్నీ తరలిపోయేలా కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై హరీష్ రావు, మరికొందరు తెరాస నేతలు మండిపడుతున్నారు.. అయితే గతంలో ఏపీకి ప్రత్యేకహోదాకు మేము కూడా మద్దతిస్తామన్న తెరాస ఇలా యూ టర్న్ తీసుకుందేంటి? అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తోన్నారు.