TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు హరీష్ రావు పరామర్శ

Published on: Sun Jul 27, 2025 4:16PM

 

బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను  బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలిక వసతి గృహంలో  ఫుడ్ పాయిజన్ 150 మంది విద్యార్థులు  ఆస్పపత్రిలో చేరారు. హరీశ్ రావు వస్తున్నారని తెలిసి చికిత్స పూర్తవ్వకుండానే విద్యార్థులను డిశ్చార్జి చేశారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు... చేతలు కావాలని స్పష్టం చేశారు."గతంలోనూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగితే, మరోసారి ఇలాంటివి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటానని సీఎం అన్నారు... మరి ఉయ్యాలవాడ ఘటన ఎలా జరిగింది? ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారులు పాటించడం లేదా? ఢిల్లీకి వెళ్లడానికి దొరికిన సమయం, విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు దొరకదా? ఫుడ్ పాయిజనింగ్ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలి..

మానవ హక్కుల కమిషన్, హైకోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి... రేవంత్ రెడ్డీ... మాపై కోపం ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టండి... అంతేగానీ విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోకండి" అంటూ హరీశ్ రావు అన్నారు.కొల్లాపూర్ మండలం బండాయిగుట్టకు చెందిన ఒక తల్లి నాగర్‌కర్నూల్ గురుకుల కాలేజీలో చదివే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, ఇంటికి తీసుకపోదామని వస్తే..ఈరోజు ఉదయం అన్నంతో పెట్టిన సాంబారులో కూడా పురుగులు వచ్చాయని తెలిపింది నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు అసహ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు