అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. కేసీఆర్ ఆదేశం
Published on: Wed Aug 29, 2018 2:46PM

సినీనటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ తెల్లవారుజామున నల్గొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.. కాగా, హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.. ఈమేరకు హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ జోషిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.. హరికృష్ణ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.


