TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబుపై హరికృష్ణకు కోపం పోయినట్లే?

Published on: Sat Jan 7, 2012 11:52AM

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కోపం పోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన శనివారం ఉదయం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. చాలా కాలంగా ఆయన చంద్రబాబుపై అలక వహించారు. అసమ్మతి బావుటా ఎగురేశారు. శనివారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ విస్తృత స్థాయి సమావేశం వంటి విషయాలపై చర్చ జరిగింది. మద్యం సిండికేట్లపై కూడా పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటన విజయవంతం కావడంపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణులను పార్టీ శ్రేణులు సమర్థంగా ఎదుర్కున్నాయని చంద్రబాబు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించారు.