నామినేషన్‌కి సిద్ధమవుతున్న హరికృష్ణ

 

 

 

నందమూరి హరికృష్ణ నామినేషన్‌ వేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి హరికృష్ణ ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే హరికృష్ణ నామినేషన్ వేయకుండా ఆపాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా హరికృష్ణ మాట విననట్టు తెలుస్తోంది. సాయంత్రం మూడు గంటల లోపు తన నామినేషన్ దాఖలు చేయడం కోసం అవసరమైన పత్రాల సేకరణలో హరికృష్ణ అనుయాయులు బిజీగా వున్నట్టు తెలుస్తోంది.