TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీ కన్నా తమకు ఏదీ ముఖ్యం కాదు: హరికృష్ణ

Published on: Sat Jan 28, 2012 8:05AM

గుంటూరు : పార్టీలో తాను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలంగానే ఉన్నామని  తాము క్రియాశీలంగా లేమనడం సరికాదని, పార్టీ కన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు.ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ వేళ్తూ మాచర్లలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆరోపించే వారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.రాష్ట్రంలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం అమానుషమని హరికృష్ణ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను, పేదలకు పట్టెడన్నం పెట్టిన అన్న ఎన్టీఆర్ ప్రతిమలను రాష్ట్రంలో కొందరు ధ్వంసం చేయడం అనాగరికచర్య అని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు సంయమనం పాటించాలని హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆధునిక యుగంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు. ఈ దాడులను ప్రజలందరూ ఖండించాలని కోరారు.