మోడీ ఏమైనా మహాత్మా గాంధీ అనుకుంటున్నాడా?

కొన్ని నెలల క్రితం, తీవ్రమైన వ్యాఖ్యలు చేసి జైలు పాలైన పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్, 6  నెలలు రాష్ట్రం విడిచి పెడతాననే వాగ్ధానానికి కట్టుబడి, సరిగ్గా ఈ రోజే గుజరాత్ లో కాలు పెట్టాడు. వస్తూ వస్తూనే, మోడీ మరియు బీజేపీ గోవర్నమెంట్ మీద తీవ్ర విమర్శలు చేసాడు.

 

"రెండు లక్షల విలువైన సూట్ వేసే మోడీ ఏమైనా మహాత్మా గాంధీ అనుకుంటున్నాడా, ఖాదీ క్యాలెండరుల పైన తన ఫోటో వేయుంచుకుంటున్నాడు, తానేదో ఖాదీ కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు. గత ఎన్నికల్లో పటేల్ వర్గం సహాయంతో బీజేపీ గుజరాత్ లో గెలిచింది, కానీ రిజర్వేషన్ల విషయం వచ్చేసరికి నిట్ట నిలువునా ముంచింది," అన్నాడు హార్దిక్.

 

ఈ సంవత్సరం చివర్లో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ని ఓటమి పాలు చేస్తాం అని సవాలు చేసాడు హార్దిక్. బీజేపీ కి వ్యతిరేకంగా వచ్చే ప్రతి పార్టీ ని కలుపుకుపోతాం అని చెప్పాడు. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ హార్దిక్ పటేల్ కి మద్దతిస్తున్నారు. కేజ్రీవాల్ అయితే ఏకంగా హార్దిక్ ని దేశభక్తుడి గా ప్రశంసించాడు.