TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంగ్లాండ్ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం!

Published on: Sun Jun 21, 2026 7:49AM

వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతుండగా హార్థిక్  తొడకండరాలకు గాయమైంది. కోలుకోవడానికి అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పట్టనుండటంతో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌లతో పాటు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల జట్టులోకి సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ టూర్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది జూన్ 22న జరిగే అతని ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా తేలనుంది. ఐపీఎల్ ఫైనల్‌లో కండరాల నొప్పితో బాధ పడుతున్న కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. 

అందుకే విరాట్ కూడా అఫ్గాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. జూన్ 22న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌ను సమీక్షించనుంది. ఆ పరీక్షలో పాస్ అయితేనే జూలైలో జరిగే ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు కోహ్లీ ఎంపికవుతాడు. సీనియర్ ఆటగాళ్ల గాయాల బెడద గిల్ నేతృత్వంలోని యువ జట్టుకు సవాలుగా మారుతుంది.