నవ్యాంధ్ర నిత్య నూతనంగా వుండాలి: చంద్రబాబు
Published on: Thu Dec 31, 2015 6:41PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో నవ్యాంధ్రలో అంతా నిత్య నూతనంగా వుండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ జన్మభూమి - మావూరు కార్యక్రమంలో పాల్గొని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే గవర్నర్ నరసింహన్ తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వుండాలని గవర్నర్ ఆకాంక్షించారు.


