కొత్త సంవత్సరం వచ్చేసింది
Published on: Thu Dec 31, 2015 6:03PM

నూతన సంవత్సరం 2016ని ఆహ్వానిస్తూ పలు దేశాల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముందే ఆస్ట్రేలియాలోనిసిడ్నీ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 3.30 గంటలకు క్రిస్మస్ దీవుల్లో నూతన సంవత్సరం ప్రవేశించింది. 3.45 గంటలకు చతామా దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4.30 గంటలకు న్యూజిలాండ్‌లో నూతన సంవత్సరం ప్రవేశించింది. బాణసంచా మెరుపులు, నృత్యాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూజిలాండ్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు.


